బాబోయ్...బిజీ ట్రాఫిక్‌లో బైక్‌పై ముద్దులాడిన జంట

బాబోయ్...బిజీ ట్రాఫిక్‌లో బైక్‌పై ముద్దులాడిన జంట

తల్లిదండ్రులు, సమాజం ఇచ్చిన స్వేచ్ఛను యువత విచ్చలవిడితనంగా భావిస్తున్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బైక్‌లమీద తిరుగుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఓ ప్రేమజంట నడిరోడ్డుమీద బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేయడం ఇపుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. బైక్‌పై కూర్చొని ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయిన ఓ జంట వీడియో ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆ ప్రేమజంట ఏం చేశారో తెల్సుకుందాం!

పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ సమీపంలో ఓ బిజీ రోడ్డులో..బైక్‌మీద ఓ ప్రేమజంట షికారు చేస్తున్నారు. సాయంత్రం పూట కావడంతో ఆ రోడ్డు బిజీ బిజీగా ఉంది. అంత బిజీ ట్రాఫిక్‌ను కూడా లెక్క చేయకుండా వారిద్దరూ కౌగిలించుకుని రైడ్ చేశారు. ఈ వ్యవహారాన్నంతా ఆ దారిలో వెళ్తున్న ఐపీఎస్ అధికారి ఒకరు ఫోన్‌లో రికార్డ్ చేశారు. అమ్మాయి బైక్ పెట్రోల్ ట్యాంకర్‌పై కూర్చొని ఉంటే…యువకుడు బైక్ డ్రైవ్ చేస్తూ ఆమెతో రొమాన్స్‌లో మునిగిపోయాడు. ముద్దులు కూడా పెట్టుకున్నారు. బిజీ ట్రాఫిక్‌లో, బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ…ప్రియుడు ప్రియురాలితే రొమాన్స్ చేశాడు.

ఈ సంఘటన మొత్తం ఆ దారిలో వెళ్తున్న ఐపీఎస్ అధికారి దలివాల్ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని కొత్త సెక్షన్‌లు చేర్చాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ ప్రేమజంట నడిరోడ్డు మీద రొమాన్స్ రచ్చపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *