ఢిల్లీ క్యాపిటల్స్‌ VS ముంబై ఇండియన్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ VS ముంబై ఇండియన్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల ఫలితాల టెన్షన్ ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ముప్పై నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌.

మోజో ప్రెడిక్షన్‌…

ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ ఢిల్లీలోని ఫిరోజ్‌షాకోట్లా స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ ఆసాంతం పిచ్‌ మందకొడిగానే ఉంటుంది. సీమర్లకూ అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లూ మాయచేయగలరు. కొత్తకుర్రాళ్ల జోరు ఢిల్లీ జట్టుకు బలంగా ఉంది. భారీ హిట్టర్లతో ముంబై బలంగా ఉంది.

160 దాటితే విజయమే…

టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి లో స్కోరింగ్‌ మ్యాచ్‌గా మిగిలే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 150 పరుగులు చేసినా… ప్రత్యర్థి జట్టును అడ్డుకోవచ్చు. 160 పరుగులు దాటితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశాలాను జారవిడచకుండా ఉంటే ఈ గ్రౌండ్‌లో 140 పరుగులనైనా కాపాడుకుని విజయం సాధించవచ్చు. ఈ రెండు జట్లనూ పోల్చిచూస్తే… లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో రాణించగల ఆటగాళ్లు ఇరు వైపులా తక్కువగానే ఉన్నారు. సొంత మైదానం కావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోజో అంచనా ప్రకారం ఢిల్లీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *