ఢిల్లీ క్యాపిటల్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌  VS చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల ఫలితాల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న రెండో క్వాలిఫైర్‌ మ్యాచ్‌లో విశాఖ వేదికగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

ఢిల్లీ క్యాపిటల్స్‌ VS చెన్నై సూపర్‌ కింగ్స్‌ … విశాఖలోని రాజశేఖర్‌ రెడ్డి స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ స్వతహాగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే చివరి మూడు మ్యాచ్‌ల నుండీ దీని తీరు మారింది. బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. ముఖ్యంగా పేస్‌ బౌలింగ్‌ ప్రభావం బాగా కనిపిస్తోంది. 170 పరుగులే మంచి టార్గెట్‌ అనేలా పిచ్‌ ఉంది. 160 పరుగులు చేసినా… టార్గెట్‌ను కాపాడుకోవచ్చు అనేట్టుగా ఉంది.

170 కొడితే విజయమే ..

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి స్లో ట్రాక్‌గా ఉంది. పరుగుల వేగం పెద్దగా ఉండదు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు చేస్తే… విజయం దాదాపు ఖాయమైనట్టే. ఇరు జట్ల బలాబలాలూ పిచ్‌కు అనుగుణంగా అంచనా వేసిన తర్వాత… ఢిల్లీ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరు తొలుత బ్యాటింగ్‌ చేసినా… 160 లోపు పరుగులే చేసే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *