ఢిల్లీ క్యాపిటల్స్‌ VS చెన్నై సూపర్‌కింగ్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ VS చెన్నై సూపర్‌కింగ్స్‌

ఐపీఎల్‌ 2019 సీజన్‌ మొదలైంది. ఎన్నికల వేడి ఎంతలా ఉన్నా ఐపీఎల్‌ ధీమాగానే నడుస్తోంది. ఈ ఐపీఎల్‌ ఉత్సాహాన్ని మోజోతో ప్రెడిక్షన్‌తో కలిసి షేర్‌ చేసుకోండి. 2019 సీజన్‌లో భాగంగా జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడున్నాయి. ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో మీకోసం మోజో అంచనా వేస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రెడిక్షన్‌

మోజో ప్రెడిక్షన్‌…

ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ జైపూర్‌లోని ఫిరోజ్‌షాకోట్లా స్టేడియంలో తలపడనున్నాయి. ఈ గ్రౌండ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ ఆసాంతం పిచ్‌ మందకొడిగానే ఉంటుంది. సీమర్లకూ అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లూ మాయచేయగలరు. కొత్తకుర్రాళ్ల జోరు ఢిల్లీ జట్టుకు బలంగా ఉంది. సీనియర్ల అనుభవం చెన్నైకు బలంగా ఉంది. ఒకరకంగా దీన్ని సీనియర్లకూ, జూనియర్లకూ మధ్యపోరులా చూడొచ్చు.

160 దాటితే విజయమే…

టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్‌ స్వభావాన్ని బట్టి లో స్కోరింగ్‌ మ్యాచ్‌గా మిగిలే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 150 పరుగులు చేసినా… ప్రత్యర్థి జట్టును అడ్డుకోవచ్చు. 160 పరుగులు దాటితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశాలాను జారవిడచకుండా ఉంటే ఈ గ్రౌండ్‌లో 140 పరుగులనైనా కాపాడుకుని విజయం సాధించవచ్చు. ఈ రెండు జట్లనూ పోల్చిచూస్తే… లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో రాణించగల ఆటగాళ్లు చెన్నై వైపే ఎక్కువగా ఉన్నారు. ఏదేమైనా పోరు రసవత్తరంగా సాగుతుంది. ఈరోజు టెన్షన్‌తో కూడిన మ్యాచ్‌ను చూడబోతున్నాం. కుర్రాళ్లు అద్భుతాలు చేస్తేనే, మందకొడి పిచ్‌ మీద సంయవనాన్ని పాటిస్తేనో తప్ప… చెన్నైకే విజయాన్ని ముద్దాడే అవకాశాలు ఉన్నాయి. రాయుడు, రైనాలను వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపితే ఢిల్లీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ రోజు ప్రదర్శనలో…

కీలకంగా మారబోయే ఆటగాళ్లు…
రాయుడు (బ్యాటింగ్‌), రైనా (బ్యాటింగ్‌), జాదవ్‌ (బ్యాటింగ్‌) , ఇమ్రాన్‌ తాహీర్(బౌలింగ్‌), జడేజా(బౌలింగ్‌)… (చెన్నై సూపర్‌ కింగ్స్‌)

కీలకంగా మారబోయే ఆటగాళ్లు…
ధావన్‌(బ్యాటింగ్‌), అయ్యర్‌(బ్యాటింగ్‌), పంత్‌(బ్యాటింగ్‌), రాబాడా(బౌలింగ్‌), ఇషాంత్‌ (బౌలింగ్‌), బోల్ట్‌(బౌలింగ్)… (ఢిల్లీ క్యాపిటల్స్‌)

ఇబ్బంది పడే ఆటగాళ్లు…
వాట్సన్‌ (బ్యాటింగ్‌), ధోనీ(బ్యాటింగ్‌), బ్రావో(బ్యాటింగ్‌)……. (చెన్నై సూపర్ కింగ్స్‌)

ఇబ్బంది పడే ఆటగాళ్లు...
ఇంగ్రామ్‌(బ్యాటింగ్), కీమోపాల్ (బ్యాటింగ్‌)… (ఢిల్లీ క్యాపిటల్స్‌)

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *