డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదల

డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదల

వరస హిట్స్‌తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అంటు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్ . ఇప్పటికే టీజర్‌, సాంగ్స్ సినిమాపై హై క్రియేట్ చేసిన చిత్రటీమ్ తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో ఫ‌న్, ఫ్ర‌స్ట్రేష‌న్, ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్నీ ఉన్నాయి. ట్రైల‌ర్‌తో క‌థ గురించి ముందే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇష్ట‌మైన దాని కోసం పోరాటం చేసే యువ‌కుడిగా విజ‌య్ క‌నిపించాడు. ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి ఛాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంతకుముందు విజయ్ దేవరకొండ ,రష్మిక కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆటోమిటిక్‌గా డియర్ కామ్రేడ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. భరత్ కమ్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో జూలై 26న రిలీజ్ కానుంది.మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాతో విజయ్‌కి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *