దాసరి పెద్ద కుమారుడు ప్రభు అదృశ్యం

దాసరి పెద్ద కుమారుడు ప్రభు అదృశ్యం

తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు గారికి ముందు తర్వాత అని మాట్లాడుకునే స్థాయికి ఎదిగారు ఆయన. దర్శకుడిగా 150 సినిమాలకు పైగా తీసి తనకంటూ గొప్ప పేరుని సంపాదించుకున్న దాసరి…సినీ పరిశ్రమలో ఎంతో మంది సమస్యలు దగ్గరుండి పరిష్కరించారు. ఆయన ఇంట్లో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం మూడు పూటలా జరుగుతుందనేది అందరికీ తెలిసిందే…అలాంటి దాసరి ఇంట్లో చిన్న చిన్న పొరపొచ్చాలు ఉండటం ఇపుడు సినీ అభిమానులకు, ఆయన సన్నిహితులకు కొంచెం బాధగానే ఉంది.

గతంలో దాసరి పెద్ద కోడలు మీడియాకెక్కి తన ఆస్తి కొట్టేశారంటూ మోహన్ బాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ సంఘటన అనంతరం తాజాగా దాసరి పెద్ద కుమారుడు ప్రభు కనిపించడంలేదంటూ ఫిర్యాదు నమోదైంది. జూన్ 9న ప్రభు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ప్రభు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పది సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ప్రభు మిస్ అయ్యాడు. 2008లో కొన్ని రోజులు కనబడకుండా పోయారు. ఆ తర్వాత తిరిగొచ్చి తన భార్యే తనను కిడ్నాప్ చేయించిందని సంచలమైన ఆరోపణలు చేశారు. మళ్లీ ఇపుడు అప్పటిలాగే అదృశ్యమవడంతో అనుమానాస్పదంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేసిన వివరాల్లో ప్రభు చిత్తూర్ జిల్లాకు వెళ్లినట్టు తెలుసిందని చెప్పారు. ప్రభు తన మొదటిభార్య దగ్గరికి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుకు చాలా రోజుల నుంచి భార్యతో ఆస్తి గొడవలు ఉన్నాయి. 2008లో లాగానే కొద్ది రోజులకి తిరిగి వస్తాడా లేదా అనేది చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *