ఇక తండ్రులూ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు

ఇక తండ్రులూ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు

కాలం చాలానే మార్పులను తీసుకొస్తుంది. మనం ఊహించని ప్రపంచాన్నీ, అసంభవమనుకున్న దృశ్యాలనూ మన కళ్లకు కట్టి చూపిస్తుంది. ఈ తతంగమంతటిలోనూ సైన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. భూమి పుట్టినప్పటి నుండీ, నేల మీద తొలి శిశువు పెదాలు పాలతో తడిచినప్పటి నుండీ… చనుబాలు అమ్మలు మాత్రమే ఇస్తారని మనకు తెలుసు. పురుషులు పాలు ఇవ్వడమనేది అసంభవమైన విషయంగా భావిస్తాం. కానీ ఇప్పుడు పురుషులూ పాలు ఇవ్వొచ్చని జపాన్‌ పరిశోధకులు చెప్తున్నారు. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

సరికొత్త గ్యాడ్జెట్…

కాలంతో పాటు సైన్స్‌ చాలానే మాయలు చేయగలదు. టెక్నాలిజీని రోజువారి జీవితంలోకి మోసుకునీ రాగలదు. అందులో భాగంగానే జపాన్‌ పరిశోధకులు సరికొత్త గ్యాడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది అట్లాంటింట్లాటి గ్యాడ్జెట్ కాదు. ఇంతవరకూ ఇలాంటి దాన్ని మనం ఊహించి ఉండం. జపాన్ సంస్థ ‘దెంత్సూ’ ఈ గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. దీనికి ‘ఫాదర్స్ నర్సింగ్ అసిస్టెంట్’అని పేరు పెట్టారు. టెక్సాల్‌లో జరిగిన SXSW ఫెస్టివల్‌లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ గ్యాడ్జెట్‌లో పాలను నింపుకుని, బ్యాగ్‌లా తగిలించుకుంటే… పిల్లలకు పాలు తాగించొచ్చు. దీని నుంచి పాలు తాగిన పిల్లలు స్తనాల నుంచే పాలు తాగుతున్నట్టు భావిస్తారని ఈ సంస్థ తెలుపుతోంది. అలా భావించడానికే దీని తయారీ కోసం సిలాకాన్‌తో తయారుచేసిన చనుమొనలను ఉపయోగించామన్నారు. పిల్లల పెంపకం విషయంలోనూ, పోషణ విషయంలోనూ తల్లులే ఎక్కువ పాత్రను పోషిస్తున్నారనీ… ఆ పనిలో పురుషులు తక్కువగా భాగస్వాములవుతున్నారనీ… పురుషులనూ ఈ పనిలో ఓ చెయ్యి వేసేలా చేసేందుకే దీన్ని రూపొందించామన్నారు. కొన్నికొన్ని సమయాల్లో తీవ్రం అనారోగ్యంతో ఉన్నా… తల్లులకు పిల్లల పోషణ తప్పదనీ, అలాంటి సమయాల్లో ఈ గ్యాడ్జట్‌ బాగా ఉపయోగపడుతుందనీ… దీని తయారీదారులు చెప్తున్నారు. అయితే దీని గురించీ, మార్కెట్లో ప్రవేశపెట్టబోయే వివరాల గురించీ ఇంకా వెల్లడించలేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *