మాజీ క్రికెటర్‌కు బ్లాంక్‌ చెక్ ఇచ్చిన పాండ్యా

మాజీ క్రికెటర్‌కు బ్లాంక్‌ చెక్ ఇచ్చిన పాండ్యా
సాయం చాలా గొప్పది. అదే ప్రాణాలను నిలబెట్టే సాయం అయితే మరింత గొప్పది. సెలబ్రెటీ స్టేటస్ల కంటే, సంపాదించుకున్న పేరు కంటే గొప్పది. సాయం… మనుషల మీద మనుషులకు నమ్మకాన్ని పెంచుతుంది. కష్టమొస్తే ఒకే ఆకాశం కింద బతుకుతున్న తోటి మనుషి అండగా ఉంటాడన్న భరోసానిస్తుంది. సాటి మనిషిని ప్రేమించడానికి బోలెడంత కారణాన్ని చూపుతుంది. అలాంటి ఒక కారణం క్రికెటర్ కృనాల్‌ పాండ్యా రూపంలో వచ్చింది. ప్రాణాలను నిలబెట్టేందుకు అతడు వేసిన అడుగు మనుషులున్నారన్న నమ్మకాన్నిచ్చింది. 

Krunal Pandya

బ్లాంక్‌ చెక్‌ ఇచ్చాడు…

గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆర్ధిక సమస్యల కారణంగా వైద్యం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే అతనికి అండగా కొందరొచ్చారు. మార్టిన్‌ ప్రాణాలను కాపాడే బాధ్యతను తమ భుజాల మీద వేసుకున్నారు. సారథి గంగూలీ, యూసుఫ్ పఠాన్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్‌లు సాయం చేశారు. వీరికి జతగా కృనాల్‌ పాండ్యా కూడా తోడయ్యాడు. ఏకంగా బ్లాంక్‌ చెక్‌ను పంపాడు. ఎంత అవసరమైతే అంతా రాసుకోమని బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మాజీ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు చెప్పాడు. సాయం కోరాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పడు… ఇలా స్వతహాగా వచ్చి సాయం చేయడంతో కళ్లు చమర్చాయని మార్టిన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *