టిక్ టాక్ పిచ్చి కాస్త కొడుకు ప్రాణాలమీదికి..

టిక్ టాక్ పిచ్చి కాస్త కొడుకు ప్రాణాలమీదికి..

టిక్ టాక్ పిచ్చి కాస్త ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్‌తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్‌లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా బిగిసిపోయాడు. ఫ్రిజ్‌లో కూలింగ్ ఎక్కువగా ఉండటంతో.. ఫ్రిజ్‌ లోపల నుంచి పొగలు వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడతున్నారు. చిన్న పిల్లాడితో ఇదేం చేష్టలంటూ తిట్టిపోస్తున్నారు. ఆ పసివాడికి ఏదైనా అయితే ఏం చేస్తారు.. వాళ్ళసలు కన్నవారేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సరదా పేరుతో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమేంటంటు శాపనార్థాలు పెడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *