జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ.. బ్యాలెట్ ఓట్లకు చెదలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ.. బ్యాలెట్ ఓట్లకు చెదలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో స్థానిక సంస్థల కౌంటింగ్‌ కాసేపు నిలిచిపోయింది.బ్యాలెట్‌ బాక్స్‌లోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టడంతో ఎంపీడీఓ,డీపీఓ కలెక్టర్‌కు సమాచారం అందించారు.పై అధికారుల ఆదేశాలు వచ్చే వరకు కౌంటింగ్‌ని నిలిపివేశారు.అటు…ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం తలోడి ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు సైతం చెదలు పట్టాయి.బాలెట్‌ బాక్స్‌లోని 479 ఓట్లకి చెదలు పట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా..రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓట్లు చెదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *