వివాదాల్లో 'సీత'

వివాదాల్లో 'సీత'

నేను రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజయం అందుకోని బౌన్స్ బ్యాక్ అయిన తేజ… కాస్త గ్యాప్ ఇచ్చిన చేసిన సినిమా సీత. కాజల్ అగర్వాల్, సాయి శ్రీనివాస్ జంటగా నటించిన ఈ మూవీ విడుదలవడమే అనుకుంటున్న సమయంలో ఒక వివాదంలో చిక్కుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం `సీత`. మే 24న ఈ సినిమా విడుదలయినది. అయితే ఈ సినిమా టైటిల్‌కు, అందులో సంభాషణలు, సన్నివేశాలు విరుద్ధంగా ఉన్నాయని ఓ హిందూ వాద సంస్థ సినిమా విడుదలకు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అయితే దీనిపై స్పందించిన దర్శకుడు తేజ మాత్రం మండిపడ్డాడు.

`సీత సినిమాకు `సీత` అని కాకుండా శూర్పణక అని టైటిల్ పెట్టాలా?.. అసలు టైటిల్ నేనెందుకు మార్చాలి? నేను మార్చను. అలాగే సినిమాను ఎవరికీ చూపించను. సినిమా సెన్సార్ అయ్యింది. కాబట్టి ఎవరికీ సినిమాను చూపించాల్సిన అవసరం లేదు. ఎవడొస్తాడో చూస్తాను. సినిమా 24 ఉదయం 11 గంటలకు విడుదలవుతుంది. ఎవడాపుతాడో చూస్తా“ అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *