పట్టిన చేపలన్ని ఉచితంగా పంచేశాడు..!

పట్టిన చేపలన్ని ఉచితంగా పంచేశాడు..!

ఈ మధ్య కాలంలో కొన్ని జిల్లాల్లో చెరువుల్లోని చేపలను స్థానిక ప్రజలు దొంగలిస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నెల 6న మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోనూ,16న చిన్నగూడురూ మండలంలోనూ, 17న కురవి మండలంలోనే చింతపల్లి గ్రామంలోనూ చేపలను దొంగలించారు. పన్నెండు రోజుల వ్యవధిలో రెండు మండలాలకు చెందిన నాలుగు గ్రామాల్లో చేపలు దొంగలించబడ్డాయి. ఈ దొంగతనాలన్నీ రాత్రి పూట కాకుండా పగటిపూటే జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ వరుస ఘటన వల్లనేమో…మునగాల మండలంలో ఓ చేపల వ్యాపారి తన చెరువులోని చేపలను గ్రామంలోని ప్రజలకు ఉచితంగా పంచిపెట్టాడు. మునగాల చెరువులో పెంచిన చేపలను సోమవారం నాడు వ్యాపారి నల్లపాటి శ్రీనివాస్ కొనుక్కున్నాడు. తర్వాత వాటిని విక్రయించకుండా ముందుగా గ్రామంలోని వారికి ఉచితంగా పంపిణీ చేశాడు. గ్రామంలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఆ చేపలను పంచిపెట్టాడు. మునగాలలో దాదాపు 3000 రేషన్ కార్డుదారులు ఉన్నారు. వారందరికీ ముందుగా కూపన్లు అందించారు. ఆ కూపన్‌లు చూపించి చేపలను తీసుకోవాలని చెప్పారు. ఒక్కో కూప్‌కు 2కేజీల చేపలు ఉచితంగా ఇచ్చారు. అలా పంచిందో ఎంతో తెలుసా!..అక్షరాల నాలుగన్నర టన్నుల చేపలను ఉచితంగా ఇచ్చేశాడు. గ్రామంలోని వారికి పంచిపెట్టాక మిగిలిన చేపలనే అమ్మాలని వ్యాపారి నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *