కరిగిన కాంగ్రెస్ కంచుకోట..!!

కరిగిన కాంగ్రెస్ కంచుకోట..!!

ఒకనాడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారం కోసం ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ధాటికి, ఒకనాడు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారం కోసం ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ధాటికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ దెబ్బకు దాదాపు కుదేలైపోయిన కాంగ్రెస్ తిరిగి కోలుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. మోడీ నేతృత్వంలోని కమలదళాన్నినిలువరించడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది.  ఎన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీకి అండగా ఇటు తల్లి సోనియా గాంధీ, అటు సోదరి ప్రియాంకా గాంధీరంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికార పీఠం ఎక్కించడానికి అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. ఒకనాడు కనుసైగతో జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఇంతగా ఇబ్బందులు పడడానికి ఆ పార్టీ నేతల వ్యవహార శైలే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, కేంద్రీకృత రాజకీయాలు నడుపుతూ, ప్రజాభిమానం ఉన్న నేతలను దూరం పెట్టడం, అవినీతి ఆరోపణలు,ఒకదాని వెనుక ఒకటి బయటపడుతూ వచ్చిన కుంభకోణాలు… ఇవన్నీ ఆ పార్టీని మరింతగా దిగజారేలా చేశాయని, బీజేపీని గద్దెను ఎక్కేలా చేశాయని చెబుతున్నారు.

గత ఎన్నికలలో ప్రతిపక్ష హోదాకు కూడా సరిపడా సీట్లు సాధించుకోలేకపోయిన కాంగ్రెస్ ఆ తరువాత కాలంలోనూ పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయిందని అంటున్నారు. తిరిగి ప్రజాభిమానాన్ని పొందడానికి కావలసిన చర్యలు తీసుకోవడంలోనూ విఫలం అయ్యిందని రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే ఇప్పుడు గెలుపు కోసం అంతగా కష్టపడాల్సి వస్తోందని చెబుతున్నారు. కోటరీ రాజకీయాలు నాడు సోనియా గాంధీని దూరం చేశాయని, నేడు రాహుల్ గాంధీకీ అదే పరిస్థితి ఉందంటున్నారు. పార్టీపరంగా బీజేపీ, ప్రభుత్వపరంగా నరేంద్రమోడీ చేసిన తప్పిదాల కారణంగా కాంగ్రెస్ బలం పుంజుకోగలిగిందని, సొంత కృషి వల్ల కాదని మాత్రం స్ఫష్టం చేస్తున్నారు. ఇకవేళ కాంగ్రెస్ ప్రజలలోకి పూర్తిస్థాయిలో చొచ్చుకునిపోయి ఉంటే, ఇప్పడు బీజేపీని ఓడించడం సులువయ్యేదని పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయం. ప్రియాంకను ఈసారి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఆపార్టీకి లాభించే అంశమేనని చెబుతున్నారు. కానీ, ప్రియాంకను ఎంపీగా పోటీ చేయించడానికి వెనుకడుగు వేయడం ద్వారా ఆ పార్టీ మరో చారిత్రక తప్పిదం చేసిందని అంటున్నారు. దీని కారణంగా పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *