కాంగ్రెస్‌ నేత తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష

కాంగ్రెస్‌ నేత తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ నేత తూముకుంట నర్సారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే.. ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం కోసం భూ నిర్వాసితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని.. లేనిపక్షంలో తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ప్రభుత్వాన్ని నర్సారెడ్డి హెచ్చరించారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *