ఆమెని చూస్తేనే ఉలిక్కి పడుతున్న హీరోలు

ఆమెని చూస్తేనే ఉలిక్కి పడుతున్న హీరోలు

ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై మెరిసిన మల్లెతీగ సాయి పల్లవి… మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సాయి పల్లవి… తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు…

నానికి సాయి పల్లవికి…

ఫస్ట్ సినిమా హిట్ అవడంతో సాయి పల్లవికి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మంచి ఆఫర్లు వచ్చాయి కానీ కాస్త జాగ్రత్తగా సినిమాలని ఎంచుకున్న సాయి పల్లవి నాచురల్ స్టార్ నాని పక్కన నటించింది. ఆమె రూపంలో నానికి యాక్టింగ్ లో గట్టి పోటీ ఎదురయ్యిందనుకున్నారు అయితే MCA సినిమా షూటింగ్ సమయంలో నానికి సాయి పల్లవికి మధ్య ఏవో గొడవలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి.. అవి ఎంత వరకూ నిజమో తెలియదు కానీ సినిమా విడుదల అయినా తర్వాత మాత్రం ఎవరిదారిన  వెళ్లిపోయారు…

sai pallavi new movie

బాహాటంగానే…

MCA తర్వాత సాయి పల్లవి నాగ శౌర్యతో కలిసి కణం సినిమా చేసింది… ఈ చిత్ర షూటింగ్ సమయంలో కూడా నాగ శౌర్య, ఒకానొక దశలో హీరోయిన్ గురించి మాట్లాడడానికి కూడా శౌర్య ఇష్టపడలేదు.. సాయి పల్లవి మాత్రం అలాంటిదేమి లేదు, శౌర్య తనకి మంచి మిత్రుడు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ నాగ శౌర్య మాత్రం సాయి పల్లవితో బాగా ఇబ్బంది పడినట్లు బాహాటంగానే చెప్పాడు… 

sai pallavi latest pics

శర్వానంద్…

ఇలా ఇద్దరు హీరోలను ఇబ్బంది పెట్టిన సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న శర్వానంద్ కి కూడా చుక్కలు చూపిస్తుందంట… వీరి మధ్య మనస్పర్థలకు కారణం మాత్రం బయటకి రాకున్నా సాయి పల్లవి విషయంలో శర్వా చాలా డిస్టర్బ్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది… అందుకే తను చేయాల్సిన విరాటపర్వం నుంచి కూడా తప్పుకున్నాడట.

padi padi leche manasu trailer

 ఒక హీరోయిన్ తో నటించడం ఇష్టం లేక ఒక సినిమా నుంచి తప్పుకోవడం అనేది ఎంత వరకూ నిజమనేది తెలియక పోవచ్చు కానీ సాయి పల్లవి నటించిన ప్రతి హీరో కూడా ఇబ్బందిగానే ఫీల్ అవ్వడం మాత్రం తన కెరీర్ కే మంచిది కాదు… ఒకవేళ తనపై వస్తున్న విమర్శలు నిజమే అయితే సాయి పల్లవి ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఎక్కడ సమస్య వస్తుందో ఆలోచించుకొని పరిష్కారం వైపుగా ఆలోచించడం బెటర్…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *