దేశవ్యాప్తంగా ముగిసిన మొదటి దశ పోలింగ్‌

దేశవ్యాప్తంగా ముగిసిన మొదటి దశ పోలింగ్‌

దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలు ముగిశాయి.మొత్తం 18 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగాయి.ఇక తెలంగాణలో 17లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా..ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు,25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అయితే ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.ఆరు గంటల వరకు క్యూలైన్లలో నిలబడ్డ వారికి ఎన్నికల అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.ఇక ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.అయితే తెలంగాణలో మాత్రం ఒక్క అవాంఛనీయ సంఘటన జరగలేదు.

ఇక దేశ వ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాల్లో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.ఏపీలో ఇటువంటి ఘటనలు ఆరు,అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదు, బిహార్‌లో ఒకటి…ఇక పశ్చిమ బెంగాల్‌లో ఒకటి,మణిపూర్‌లో రెండు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఇక సాయంత్రం ఏడు గంటలకు వరకు పోలింగ్ నమోదు శాతం చూసుకున్నట్లయితే జమ్ము కాశ్మీర్‌లో 54శాతం,లక్ష్మద్వీప్‌లో 65 శాతం,ఒడిస్సాలో 68శాతం నమోదైంది.ఎక్కువ పోలింగ్ నమోదైన రాష్ట్రాల్లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 70 శాతం నమోదు కాగా..,వెస్ట్ బెంగాల్ 81శాతం పోలీంగ్ నమోదైంది.

తొలిదశ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఒక వేయి 279 మంది అభ్యర్థులు తలపడగా..వీరిలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,కిరణ్‌ రిజిజు,వీకే సింగ్‌తోపాటు మహేశ్‌ శర్మ,సత్యపాల్‌ సింగ్‌ తదితరులు బరిలో ఉన్నారు.ఇక ఈనెల 18న రెండో విడత పోలింగ్ జరుగనుంది.రెండో విడతలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 97 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.అయితే పలు సమస్యల కారణంగా 428 వీవీప్యాట్లను మార్చాలి వచ్చిందన్నారు డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్ సిన్హా .ఇక మొదటి విడత పోలింగ్ జరిగిన రాష్ట్రాల్లోని ప్రజలు ఓటు వేసేందుకు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోగా..తొలి గంటల్లో కొందరు రాజకీయ నాయకులు,ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక రీపోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్న అధికారులు..ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమా అనే అంశంపై తొందరలోనే నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామన్నారు.మొత్తానికి ఈవీఎంలను ధ్వంసం చేసిన వాళ్లపై కేసు పెట్టినట్లు తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మొదటి విడత పోలింగ్ సరళి చూస్తుంటే 1967 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *