అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. డెన్వర్‌లోని ఓ స్కూల్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయలైయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరొకరు కూడా ఈ కాల్పుల్లో పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *