గవర్నర్‌తో జగన్ భేటి

గవర్నర్‌తో జగన్ భేటి

గవర్నర్ నరసింహన్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. గవర్నర్‌తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జగన్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11 (గురువారం) నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల కోసం గవర్నర్ మంగళవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయ్యింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *