వార్షికాదాయం 5 లక్షల్లోపు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం!

వార్షికాదాయం 5 లక్షల్లోపు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం!

వైఎస్ రాజశేఖర్ పదవిలో ఉన్నపుడూ…మరణించిన తర్వాతా రాజన్న పేరుతో ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఆరోగ్య శ్రీ ఒకటి. వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీల్లో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. వైఎస్ఆర్ మరణానంతరం పథకాన్ని అంతే స్థాయిలో అమలు చేయడంలో గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిచింది. దీంతో జగన్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ పథకానికి జీవం పోశారు. ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఏపీ బడ్జెట్ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకానికి ఎక్కువ కేటాయించి ప్రజల మన్ననలు పొందారు.

పెద్ద నగరాల్లో సైతం..
ఏడాదికి రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. దీని ప్రకారం ఒక వ్యక్తి నెలకు రూ. 40,000 ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ ఈ పథకం కిందకు వస్తారు. దీంతో గతం కంటే మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ బడ్జెట్‌లో రూ. 1,740 కోట్లు కేటాయించారు. అలాగే, వైద్య ఖర్చులు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *