ప్రజావేదికను కూల్చేయండి జగన్ ఆదేశం

ప్రజావేదికను కూల్చేయండి జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే స్థాయికి తీసుకొచ్చారని, ఇందులో పారదర్శకత కోసమే జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు .అవినీతి జరిగినట్టు రుజువైతే వాటిని రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసిన వారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రజావేదిక నిర్మించారని, అవినీతి, అక్రమ సంపాదనతో ఈ నిర్మాణం జరిగిందన్నారు . అక్రమంగా నిర్మించిన వేదికలో సమావేశం పెట్టే దుస్థితి ఏర్పడిందన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పాలనే ఉద్దేశంతోనే ఇందులో కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు . ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని, ఎల్లుండి నుంచి దీనిని కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, దోపిడీని తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించదని ఘాటుగా స్పందించారు జగన్ .

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *