నేడు సీఎం కాళేశ్వరం పర్యటన

నేడు సీఎం కాళేశ్వరం పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. ఇప్పటికే ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయల్దేరిన ఆయన కాసేపట్లో అక్కడి చేరుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను ఆయన పర్యవేక్షిస్తారు. అనంతరం రాంపూర్‌ దగ్గర్లోని పంప్‌హౌజ్‌ పనులను ఆయన పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకొని బ్యారేజీ పనులను పరిశీలించి ప్రాజెక్టుల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *