తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంది: సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంది: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కేసీఆర్‌.. పబ్లిక్‌ గార్డెన్స్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో కరెంట్‌ సమస్యలను అధిగమించామని.. 24 గంటల నిరంతర విద్యుత్‌ను
అందించిన ఘనత తమదేనన్నారు.మిషన్‌ భగీరథ పనులు జులై నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. పేద ప్రజలకు కనీస జీవన భద్రత కల్పిస్తున్నామన్న కేసీఆర్‌.. పెంచిన ఆసరా పింఛన్లు జులై నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *