ఆ ఇద్దరికీ మంత్రి యోగం ఉందా?

ఆ ఇద్దరికీ మంత్రి యోగం ఉందా?

తెలంగాణలో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగనుంది. ఆలోగానే అంటే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ జోరుగా సాగుతోంది. అదేమిటంటే ఈసారి మంత్రివర్గంలో హరీశ్ రావుకు చోటు లభిస్తుందా? లేదా? అన్నదే. తాజా పరిణామాలను పరిశీలించి చూస్తే హరీశ్ రావును మంత్రి పదవి వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అటు కేటీఆర్‌ను, ఇటు హరీశ్ రావునూ మంత్రివర్గంలోకి తీసుకుని అనుమానాలకు తెరదించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కీలక పదవుల్లో ఉంటే అటు ప్రభుత్వమూ, ఇటు పార్టీ రెండూ బలోపేతంగా ఉంటాయని కేసీఆర్ యోచిస్తున్నారని చెబుతున్నారు. అసలే రాష్ట్రంలో భారీ సంస్కరణలకు శ్రీకారం

ఆయా శాఖల్లో మార్పులు…
రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు, విద్యాశాఖల్లోనూ మార్పులు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో  ఆ మూడు శాఖల ఉద్యోగులతోపాటు, ఉపాధ్యాయులూ ఆందోళనకు దిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని ప్రభుత్వ పరంగానూ, పార్టీ పరంగానూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి ఈ తరుణంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండడం మంచిది కాదనేది కేసీఆర్ ఆలోచన అని చెబుతున్నారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకుని చూసుకుంటే హరీశ్ రావు, కేటీఆర్‌లకు మంత్రి పదవి గ్యారంటీ అనేది పరిశీలకుల అభిప్రాయం. కానీ, గులాబీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందనేది మాత్రం ఎవ్వరూ పసిగట్టలేకపోతున్నారని అంటున్నారు. మంత్రివర్గానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం మహిళలకు ప్రాతినిధ్యం. ఈసారి కేబినెట్ లో ఇద్దరు మహిళలకు చోటు ఉంటుందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. కానీ, ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి తొలివిడతలోనే మంత్రి పదవి లభిస్తుందని భావించారు. కానీ ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. రెండో విడతలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. మూడో విడతకు వచ్చే సరికి పోటీ పెరిగింది. కాంగ్రెస్ నుంచి గులాబీ కండువా కప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవి రేసులో నిలిచారు. అటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అమాత్య పదవిని ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో రేఖానాయక్, సత్యవతీ రాథోడ్ లలో ఎవరో ఒకరికి మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ అధినేత మనసులో ఏముందో తెలుసుకోవాలంటే మరో మూడు వారాలు వేచి చూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *