ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్ శంకర్ మధ్య ఎందుకు మనస్పార్ధలు..?

ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్  శంకర్ మధ్య ఎందుకు మనస్పార్ధలు..?

సక్సెస్‌ లేకపోతే మన మాటనెవరూ వినరు. ఇప్పుడు సౌత్ సెన్సేషన్ డైరెక్టర్‌ శంకర్‌ విషయంలో అదే జరుగుతుంది. భారతీయుడు 2 సినిమాని లైకా ప్రొడక్షన్స్‌ హౌజ్‌లో కాకుండా మరో బ్యానర్‌లో చేయబోతున్నాడట. మరి లైకా ప్రొడ్యూసర్‌కు శంకర్ మధ్య ఎందుకు మనస్పార్ధలు వచ్చాయో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…..

సౌత్ సెన్సేషన్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే కచ్చితంగా పెద్ద హిట్ అనే భావన కలుగుతుంది ఆడియన్స్‌లో. దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్లాప్ అంటే ఎంటో ఎరుగని శంకర్ స్నేహితుడు సినిమాతో ప్లాప్ టేస్ట్ ఎలా ఉంటుందో రుచి చూశాడు. ఈ మూవీ తరువాత వచ్చిన రోబో భారీ హిట్‌గా నిలిచింది. దీంతో శంకర్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అదే కాన్ఫిడెంట్‌తో విక్రమ్‌తో ఐ మూవీతో ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం కాస్త వికటించడం ఐ కాస్త డిజాస్టర్‌లోకి చేరిపోయింది. ఇక రోబోకు సీక్వెల్‌గా వచ్చిన 2. ఓ కూడా ప్లాప్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు భారతీయుడు కు సీక్వెల్‌గా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నాడు. రోబో సినిమాని నిర్మించిన లైకా ప్రొడక్షన్ సంస్థనే ఈ సినిమాని కూడా నిర్మిస్తుంది. అయితే రోబోతో నష్టాలు రావడంతో ఆ ఎఫేక్ట్ భారతీయుడు 2 సినిమా మీద పడుతుంది..

2.0 సినిమాని దాదాపు 600 కోట్లతో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ .. ఇండియన్‌ 2 బడ్జెట్‌ విషయంలో పరిమితులు విధించింది. ఇది శంకర్‌కు నచ్చలేదట. దీంతో సినిమా షూటింగ్‌ కూడా హోల్డ్‌లో పడింది. తనకు బడ్జెట్‌ పరిమితులు విధించిన లైకా ప్రొడక్షన్స్‌ను స్థానంలో కొత్త నిర్మాతలను తీసుకొచ్చే దిశగా శంకర్‌ చర్చలు జరుపుతున్నాడట. భారతీయుడు 2 మూవీని నిర్మించేందుకు మరో నిర్మాత ముందుకు వచ్చాడని చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా సవ్యంగా సాగితే భారతీయుడు 2 సినిమాని కొత్త నిర్మాతలు రూపొందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కోలీవుడ్‌ సమాచారం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *