క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డు..!

క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డు..!
క్రిస్‌గేల్..క్రికెట్ చరిత్రలో భయంకరమైన ఆటగాడు. మైదానంలో ఎక్కువసేపు ఉన్నాడంటే ఇక ఆట చివరి వరకూ ఉంటాడనే భయం ప్రత్యర్థి ఆటగాళ్లకు కలిగిస్తాడు. క్రీజులో ఉన్నంతసేపు పరిగెత్తడం గేల్‌కు ఇష్టముండదు. బంతిని బౌండరీ అయినా పంపించాలి. లేకుంటే మైదానం బయటకైనా పంపించాలి. ఇవి రెండే అతనికి తెలిసినవి.
 
Chris Gayle New Record

కొత్త రికార్డు

అతని బ్యాట్‌కి నెమ్మది అనేది తెలియదు. అతని దూకుడికి బ్రేకులనేవి ఉండవు. అతను క్రీజులో ఉంటే బౌలర్‌కి చెమటలు పట్టేస్తాయి. కాలాన్ని దాటుకుని వేగంగా బంతిని మైదానం బయటకు పంపించగల సత్తా ఉన్న ఆటగాడు. ఇపుడు గేల్ ఖాతాలోకి కొత్త రికార్డు వచ్చి చేరింది. అదే…సిక్సర్ల రికార్డ్. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు(488) కొట్టిన ఆటగాడిగా అద్భుతమైన రికార్డుని తన సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది(476) పేరు మీద ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ రికార్డుని సాధించాడు. ఈ సిక్సర్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రేండన్ మెకల్లమ్(398), శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య(352), హిట్ మ్యాన్ ఆఫ్ టీమిండియా రోహిత్ శర్మ(349), ఎంఎస్ ధోనీ(348) అత్యధిక సిక్సర్లలో జాబితాలో ఉన్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *