పరువునష్టం కింద గేల్‌కు 3,00,000 ఆస్ట్రేలియా డాలర్లు

పరువునష్టం కింద గేల్‌కు 3,00,000 ఆస్ట్రేలియా డాలర్లు

క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణం. అది ఆటలో భాగంగా ఆటగాళ్లు తమ ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి ఉపయోగిస్తారు. కానీ ఇదే స్లెడ్జింగ్ బయటవారు క్రికెటర్లపై చేస్తే…అలా చేస్తే ఏం జరుగుతుందో ఫైర్‌ఫాక్స్ అనే వార్తాపత్రికకు బాగా తెలుసొచ్చింది. ఇంతకూ ఫైర్‌ఫాక్స్ పత్రిక ఏం చేసింది. ఆ క్రికెటర్ ఎవరూ తెలుసుకుందాం….

chris gayle affair

ఆధారాలు ఇవ్వలేదు…పరువునష్టం ఇవ్వాల్సివచ్చింది!

2015 వరల్డ్ కప్ సమయంలో జరిగిన సంఘటన గురించి 2016లో ఫైర్‌ఫాక్స్ అనే మీడియా సంస్థ క్రిస్ గేల్ గురించి కథనాలు ప్రచురించింది. దీన్ని ఖండిస్తూ గేల్ పరువునష్టం దావా వేశాడు. ఈ ఘటన గురించి విచారణ జరిపిన న్యూ సౌత్ వేల్స్ సుప్రీం కోర్ట్ జడ్జీ లూసి మెక్‌కల్లమ్ తీర్పు వెల్లడించింది. గేల్‌కు 3,00,000 ఆస్ట్రేలియా డాలర్లు పరువునష్టం కింద ఇవ్వాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2016 జనవరిలో ఫైర్‌ఫాక్స్ సంస్థ గేల్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించింది. వరల్డ్ కప్ ట్రైనింగ్ సెషన్ సందర్భంలో వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో మసాజ్ చేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని రాసింది. ఈ కథనాలు అన్నీ నిజమైనవే అనడానికి ఫైర్‌ఫాక్స్ ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అవన్నీ తప్పుడు వార్తలు అని చెబుతూ గత ఏడాది అక్టోబర్‌లోనే కోర్టు నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం గేల్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో కోర్టు సమ్మతించి, గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఫైర్‌ఫాక్స్, గేల్‌పై కావాలనే తప్పుడు కథనాలను ప్రచురించినట్టు కోర్టు తెలిపింది.

” గేల్ ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు చెప్పింది. గేల్‌కు ఆస్ట్రేలియాలో ఆడటం అంటే ఇష్టం. బిగ్ బాస్ లీగ్‌లోనూ ఆడాలనుకుంటున్నాడు ” అని, గేల్ ప్రతినిధి గ్రాంట్ వాండన్‌బర్గ్ తీర్పు అనంతరం చెప్పారు.\

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *