పొరపాటుగా బీజేపీకి ఓటు వేసినందుకు వేలు నరుక్కున్నాడు

పొరపాటుగా బీజేపీకి ఓటు వేసినందుకు వేలు నరుక్కున్నాడు

దేశవ్యాప్తంగా ఎన్నికల హవా నడుస్తోంది. రెండోదశ పోలింగ్ కూడా ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో చిన్నా చితక గొడవలు, మరికొన్ని ప్రాంతాల్లో కార్యకర్తల మరణాల దాకా ఘటనలు జరిగాయి. అయినాసరే…ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకునే దాకా క్యూ లైన్‌లో నుంచుని మరీ వేశారు. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్నిచోట్ల ఊహించని ఘటనలు కూడా జరిగాయి. ఇక కేంద్రంలో అధికారాన్ని డిసైడ్ చేసే రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ ఊహించని ఘటన అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్ అనే దళిత ఓటరు…బీఎస్పీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాడు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన తర్వాత పొరపాటున బీఎస్పీకి ఓటు వేయబోయి బీజేపీకి వేశాడు. దీంతో తాను కోరుకున్న పార్టీకి కాకుండా మరో పార్టీకి ఓటు వెల్లడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చేసిన తప్పుకి పరిహారంగా తన వేలుని తానే నరికేసుకున్నాడు.

పవన్ కుమార్ బులంద్‌షర్ నియోజకవర్గానికి చెందిన ఓటరు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బోలా సింగ్‌కు… ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్‌డీ బలపరిచిన అభ్యర్థి యోగేష్ వర్మకు మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలోనే యోగేష్ వర్మకు ఓటువేయాలనుకున్న పవన్…పొరపాటుగా బీజేపీ అభ్యర్థికి వేయడంతో తన వేలుని తానే నరుక్కుని పొరపాటుకి తగిన శిక్ష వేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన గురించి పవన్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా చెప్పాడు. అది కాస్త వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతానికి మొత్తం 8 స్థానాలలో రెండోదశ పోలింగ్ జరిగింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *