చిరు, కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ రెడీ

చిరు, కొరటాల శివ సినిమా స్క్రిప్ట్ రెడీ

సైరా తరువాత హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడట కొరటాల శివ. ఈ సినిమాలో చిరు పక్కన తమిళ బ్యూటీని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. మరి చిరు పక్కన చిందులు వేయాబోతున్నా ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ….

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి.. చైనా షెడ్యూల్‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయి. ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరు మే నెల‌లో రెస్ట్ తీసుకుని.. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 152వ సినిమాను స్టార్ట్ చేస్తాడట. సామాజిక కోణంలో మెసేజ్ ఓరియెంటెడ్‌గా క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో ఎప్ప‌టిలాగానే కొర‌టాల ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇప్ప‌టికే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధ‌మైయింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే ఈ లిస్టులో న‌య‌నతార‌, అనుష్క పేర్లు విన‌ప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఈ రేసులో మ‌రో హీరోయిన్ వ‌చ్చి చేరింది. కీర్తి సురేష్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. కీర్తిసురేష్‌కున్న క్రేజ్ దృష్ట్యా, యూనిట్ ఆమెతో సంప్ర‌దింపులు చేస్తున్నార‌ని సమాచారం.‌. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రు ఫైన‌ల్ అవుతారో తెలియ‌డం లేదు. ఈ చిత్రంలో మ‌రో స్టార్ హీరోయిన్‌ శృతిహాస‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతున్నార‌ని టాక్‌.. ఈ మూవీ గురించి అఫిషియల్‌గా ఫుల్ డిటైల్స్ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *