చిరూ,బాలయ్యల మల్టీస్టార్‌ చిత్రం..ఎఫ్‌2 సీక్వెల్‌లో సీనియర్‌ అల్లుళ్లు

చిరూ,బాలయ్యల మల్టీస్టార్‌ చిత్రం..ఎఫ్‌2 సీక్వెల్‌లో సీనియర్‌ అల్లుళ్లు

ఈ సంక్రాంతి రేసులో వచ్చిన చిత్రాల్లో ఎఫ్‌2 మంచి పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్నీ కురిపిచింది. యుంగ్‌ డైరక్టర్‌ అనిల్‌ రావిపూడి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్‌ హీర్‌ వెంకీతో, కుర్రహీరో వరుణ్‌తేజ్ జతకలిసి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారు. పండుగ సీజన్‌లో పెద్ద దర్శకులతో పోటీపడి రేసులో అనిల్‌ రావిపూడి గట్టిగా నిలబడ్డాడు. సినిమా చివర్లో దీనికి సీక్వెల్‌ను తీసుకురాబోతున్నట్టు హింట్‌ కూడా ఇచ్చాడు. మొదటి పార్ట్‌ మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టడంతో… నిర్మాతలూ మరో ఆలోచన లేకుండా పచ్చజెండా ఊపేశారు.

Chiru-Balayyaya Multistar movie

అయితే పండుగే… 

ఎఫ్‌2 సీక్వెల్‌ మీద ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారిగా బాలయ్య, చిరూలు ఒకే తెరమీద కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుతరం హీరోల్లో ఈ ఇద్దరూ అగ్రకథానాయకులగా వెలిగిపపోయారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్లకూ, సరికొత్త రికార్డులకూ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. వీళ్లిద్దరూ దశాబ్దాల పాటు ఏకకాలంలో హీరోలుగా చేసినా… వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీళ్లిద్దరూ సీనియర్లు అయిపోయినా కుర్రహీరోలతో పోటపడటంలో ఎక్కడా వెనకడుగు వెయ్యరు. చిరూ రీ ఎంట్రీ ఇస్తే అభిమానులు ఘనస్వాగతం పలికారు. బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తుంటే బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. వయసు మీద పడుతున్నా వీరి స్టామినా ఎంతమాత్రమూ తగ్గలేదు.

ఎఫ్‌2 సీక్వెల్‌గా వస్తోన్న సినిమాలో ఈ ఇద్దరూ సీనియర్‌ అల్లుళ్లగా కినిపంచబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై ఇంతవరకూ అధికారప్రకటన రాలేదు. ఇదంతా రూమర్‌ అని కొందరు కొట్టి పారేస్తున్నారు. మరొకొందరు నిజమయ్యే అవకాశమూ ఉందంటున్నారు. ఇంకొందరైతే నిజానిజాలను పక్కనపెట్టి… ఈ క్రేజీ కాంబినేషన్‌ ఎలా ఉంటుందో ఊహించేసుకుంటున్నారు. ఇలా కనుక జరిగితే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఖాయమనే అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *