సురేందర్ రెడ్డిపై సీరియస్ గా ఉన్న చిరు

సురేందర్ రెడ్డిపై సీరియస్ గా ఉన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మాత్రం పెండింగ్‌లో ఉంది.. ఇటీవలే కోకాపేట లో వేసిన భారీ సెట్ అగ్ని ప్రమాదానికి గురై భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అన్నపూర్ణ ఏడెకరాల్లో మూడు చోట్ల భారీ సెట్లు నిర్మిస్తున్నారు. .ఈ సెట్‌ నిర్మాణానికి 2కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కాస్ట్ క్రూ తో ఓ పాటని చిత్రీకరించబోతున్నారట.. అయితే ఈ సినిమా మొదలు అయిప్పటి నుంచి అడుగడుగునా అటంకాలు ఎదురు అవుతునే ఉన్నాయి. ఎప్పుడో కంప్టీట్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఆ మధ్య కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేశారు. ఇప్పుటు ఒక సాంగ్ కోసం ఏకంగా రెండు కోట్ల ఖర్చుతో సెట్ నిర్మిస్తుండటంతో సురేందర్ రెడ్డిపై చిరంజీవి చాలా కోపంగా ఉన్నాడట. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాకు సంబందించిన మరో అప్డేట్ బయటకి రావట్లేదు. అందుకే వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేయాలని దర్శకుడిపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.. సురేందర్ రెడ్డి వాలకం చేస్తుంటే ఈ సైరాకు ఇప్పుడప్పుడే సినిమాకు ప్యాకప్ చెప్పే సీన్ అయితే కపించడం లేదు. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాడో చూడాలి మరి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *