చిరంజీవి అడుగుపెట్టిన ఆ కొత్త వ్యాపారం ఏంటి ?

చిరంజీవి అడుగుపెట్టిన ఆ కొత్త వ్యాపారం ఏంటి ?

సినిమా, రాజకీయం రంగాల తర్వాత మెగా స్టార్ చిరంజీవి మరో కొత్త వ్యాపారంలోకి దిగారు. ఇండస్ట్రీలో మెగా హీరోగా వెలుగొందిన చిరు, 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, పాలిటిక్స్‌లో రాణించలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో.. పీఆర్పీ 18 స్థానాలే గెలవడంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. మన్మోహన్ కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా రాజకీయాలకు దూరమైన చిరు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో కొనసాగుతున్నారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ చిరంజీవి ఇటు కాంగ్రెస్ కు.. అటు తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు. వారి తరుఫున ప్రచారం కూడా చేయలేదు. దీంతో చిరు రాజకీయ కెరీర్‌కు మూతపడింది. చిరంజీవి రాజకీయాలు వదిలి ఖైదీనంబర్ 150తో సినీ రంగ ప్రవేశం చేశాక.. సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట చిరంజీవి సినిమాలన్నింటినీ రాంచరణ్ నిర్మాతగా తీస్తున్నారు.

ఇప్పుడు సరికొత్తగా చిరంజీవి విద్యారంగంవైపు అడుగులు వేశారు. చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా.. ఆయన కుమారుడు రాంచరణ్ గౌరవ అధ్యక్షుడిగా ‘‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్’’ ను స్థాపించినట్టు మెగా ఫ్యామిలీ ప్రకటించింది. మెగా బ్రదర్ నాగబాబు గౌరవ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈవోగా జే. శ్రీనివాసరావును నియమించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఈ పాఠశాలలో మెగాస్టార్ అభిమానుల పిల్లలకు ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జే.శ్రీనివాసరావు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *