పవన్ కోసం చిరు ప్రచారం!

పవన్ కోసం చిరు ప్రచారం!

వామపక్షాలు,బీఎస్పీలతో కలిసి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ గతంలో చేసిన ప్రసంగాలకు విరుద్ధంగా తీవ్ర విమర్శలకు తావు లేకుండా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా పవన్‌కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలు కూడా ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,విశాఖలోని గాజువాక శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మొదట రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు పవన్ చెప్పినప్పటికీ ఎక్కడ పోటీ చేయాలనేదానిపై జనసేన పార్టీ కార్యవర్గమే నిర్ణయం తీసుకుంటుందనీ చెప్పారు. ఆ తర్వాత జనరల్ బాడీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసింది. ఆ సర్వేలో అనంతపురం,తిరుపతి,పిఠాపురం,పెందుర్తి,ఇచ్చాపురం,రాజానగరం,భీమవరం,గాజువాక మొదటిస్థానాల్లో ఉన్నాయి.వీటిలో మేధావులు,రాజకీయ పరిశీలకులు గాజువాక,భీమవరం స్థానాలు అయితే మంచిదని సూచించారు.

అభిమానుల చర్చ…

పవన్‌కళ్యాణ్ పోటీ చేసే స్థానాలు కూడా ఖరారు అయ్యాయి కాబట్టి ఇక జనసేన పార్టీ ప్రచారంలో వేగాన్ని పెంచే క్రమంలో అడుగులు వేస్తోంది.పవన్ ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా మంచి స్పందనే వస్తోంది.ఈ ఉత్సాహాన్ని,ప్రజల నుంచి వచ్చే స్పందనని ఓటు వేసే దాకా తీసుకెళ్లాలని పవన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.అయితే…కేవలం ప్రచారంతోనే ప్రజలనుంచి ఓట్లను తెచ్చుకోవడం కష్టమవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.పవన్‌కి ఉన్న క్రేజ్‌ని ఓట్ల రూపంలో సాధించాలంటే పవన్ క్రేజ్‌కి తోడు చిరంజీవి స్టామినా తోడైతే జనసేన పార్టీ గెలవడం పక్కా అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.పవన్ కోరితే చిరు ఖచ్చితంగా ప్రచారానికి వస్తారని,అదే గనక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త నాయకుడిని,కొత్త పాలను చూడగలుగుతందని అభిమానులు ఆశిస్తున్నారు.అయితే…ఈ చర్చలు సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతోంది కానీ వాస్తవంలో కుదరకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి ఇది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.చూడాలి..భవిష్యత్తులో చిరు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ్ముడికి అండగా నిలబడితే మెగా అభిమానుల సంబరాలకు అడ్డు ఉండదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *