ఉద్యోగులతో మూత్రం తాగిస్తున్నారు

ఉద్యోగులతో మూత్రం తాగిస్తున్నారు

కొన్నికొన్ని సంఘటనలు ఎదురుపడతాయి. మనమింకా ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో వేలెత్తి చూపిస్తాయి. ఎంత బానిసత్వంలో బతుకుతున్నామో చూపించి, భయపెడతాయి. ఇదీ అలాంటి సంఘటనే… అత్యంత అమానవీయ విషాదం. ఉద్యోగుల చేత మూత్రం తాగిస్తున్న కంపెనీ భాగోతం బయటపడింది. కార్మికులను బానిసలుగా చేసి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఈ అత్యంత కిరాతక ఆఫీస్‌ గురించీ, అక్కడి మనుషుల గురించీ తప్పకుండా తెలుసుకుని తీరాలి.

లక్ష్యాలను అందుకోక పోతే అంతే…

అది చైనా లోని ఒక ప్రయివేట్‌ పరిశ్రమ. అన్ని కంపెనీల్లో లానే సిబ్బందికి నెలానెలా స్పెషల్‌ టాస్కులూ, లక్ష్యాలూ ఉంటాయి. వాటిని చేరుకోవడానికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ కంపెనీ మరీ మితిమీరిపోయింది. ఒత్తడి నుంచి చాలా దూరం జరిగి చిత్రహింసలకు గురిచేస్తోంది. ఇచ్చిన లక్ష్యాలను చేరుకోకపోతే తాట తీస్తారు. మూత్రం తాగిస్తారు. గుండు కొట్టిస్తారు. భోజనం ఇవ్వకుండా, బొద్దింకలను తినిపిస్తారు. సహోద్యోగుల చేత దారుణంగా చితకబాదిస్తారు. రోజుకు లెక్కలేనన్ని బెల్టులు తెగిపోతాయి.

employees driniking urin

ఈ ఏడాది ఆరంభంలోనే…

ఈ కంపెనీ ఇటీవలే ప్రారంభమైంది. గుయ్‌జో ప్రావిన్స్‌లో ఓ హౌస్ రినోవేషన్ పేరుతో ఈ ఏడాది జనవరిలో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కౄరమైన నిబంధనలను విధస్తోంది. చిన్నచిన్న తప్పులకూ, అసలు తప్పులే కాని వాటికీ భారీ శిక్షలు విధించి, నిత్య నరకం చూపిస్తారు. కార్మికులు చేసే తప్పులను రోజూ లెక్కిస్తారు. నెల చివరిలో అందరి కార్మికుల సమక్షంలో వాటికి శిక్షలు విధిస్తారు.

అలా బయటికొచ్చింది…

ఉద్యోగులు పరిశ్రమలోకి మొబైల్‌ తీసుకెళ్లే అవకాశమూ లేదు. సిబ్బందికి దొరక్కుండా, మొబైల్‌తో లోపలికి ప్రవేశించిన కార్మికుడు… అక్కడ జరుగుతున్న తంతును బయటపెట్టాడు. గ్లాసుల్లో మూత్రం తాగుతున్న దృశ్యాలూ, కార్మికులను బెల్టుతో కొడుతున్న దృశ్యాలూ వైరల్‌ అయ్యాయి. వీటిని చూసిన మానవహక్కుల సంఘం వాళ్లు ఈ కంపెనీపై కేసు నమోదు చేశారు. వెంటనే స్పందించిన చైన ప్రభుత్వం ఆ కంపెనీకి సంబంధించిన ముగ్గురు మేనేజర్లకు జైలు శిక్షను విధించింది. కమ్యూనిస్టుల దేశం చైనాలోనూ… కార్మికులు ఇంత నరకాన్ని అనుభవించే పరిస్థితులు ఉండటం మరింత దారుణమని ఎంతో మంది వాపోతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *