జూలో తోడేలుకు బదులు కుక్క...షాక్ అయిన పర్యాటకులు

జూలో తోడేలుకు బదులు కుక్క...షాక్ అయిన పర్యాటకులు

ఇది చదివిన తర్వాత మీకు ఇదేదో సినిమాలో సన్నివేశం అనిపిస్తే అనిపించవచ్చు. కానీ ఇది నిజంగాజరిగిన సంఘటనే..విషయమేంటంటే…సహజంగా ప్రజలు జూకి వెళ్లి అక్కడ రకరకాల జంతువులను చూసి…వారి పిల్లలకు ఆయా జంతువులు ఎలా ఉంటాయో చెబుతూ సరదాగా గడిపి వస్తుంటారు. అయితే, చైనాలోని జుయ్‌ఫెండ్ ఫారెస్ట్‌లో జంతువులను చూడటానికి వెళ్లిన పర్యాటకులు ఒక షాకింగ్ విషయం తెలుసుకోవాల్సి వచ్చింది.ఎప్పటిలాగే జుయ్‌ఫెంగ్ ఫారెస్ట్ జూకి వెళ్లిన పర్యాటకులకు తోడేలు ఉండే ప్రాంతంలో కొంత దూరంలో తోడేలు కనిపించింది. అందరూ దాన్ని చూస్తూ కొంత దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే…కాసేపటి తరాత ఆ తోడేలు కుక్కలా అరవడం విని పర్యాటకులు అవాక్కయ్యారు. కాస్త పరిశీలంగా గమనిస్తే…అక్కడ ఉన్నది నిజంగానే కుక్క. దీంతో…జూకి వచ్చిన పర్యాటకులను మోసం చేస్తున్నారంటూ జూ అధికారులను నిలదీయడానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత మరో షాకింగ్ విషయం పర్యాటకులకు తెలిసింది.

వాస్తవం ఏంటంటే… ఆ జూలో ఇంతకుముందు చాలా తోడేళ్లు ఉండేవి. వాటిలో ఒక మగ తోడేలును మిగతా తోడేళ్లు రెండేళ్ల కిందట గాయపరచడంతో దాన్ని విడిగా ప్రస్తుతం ఉన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఆ తోడేలును ఒంటరిగా ఉంచితే, అది మరింత దిగులుగా మారిపోతుందనే ఉద్దేశంతో… దానికి తోడుగా కొన్ని ఆడ కుక్కలను కూడా ఉంచారు. వాటిలో ఒక కుక్కతో అది కలిసిమెలిసి ఉండటంతో మిగతా కుక్కల్ని తొలగించారు. పర్యాటకులు చూసిన రోజున ఆ తోడేలు లోపలికి వెళ్లి… దాని గూట్లో నిద్రపోతోంది. ఆ కుక్క మాత్రం నిద్రపోకుండా… పర్యాటకులకు కనిపించిందన్నమాట. ఈ విషయం తెలియని పర్యాటకులు అధికారులు మోసం చేశారంటూ ఆగ్రహానికి గురయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *