మనుషుల్లాగే స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన చింపాంజీ!

మనుషుల్లాగే స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన చింపాంజీ!

మనిషి ఒక వ్యసనపరుడు. మనిషికి నచ్చితే దాన్నే వ్యసనంగా మార్చుకుని రోజు మొత్త..అలా జీవితం మొత్తం ఆ వ్యసనానికి బానిసగా మారిపోతాడు. టెక్నాలజీ పెరిగిన తర్వాత టీవీలకు, తర్వాత కంప్యూటర్‌లకు, ఆ తర్వాత సెల్‌ఫోన్‌కు పూర్తీ స్థాయిలో బానిసగా మారిపోయాడు. అదెంత బానిసత్వమంటే సెల్‌ఫోన్, సెల్‌ఫోన్‌లో ఉండే సోషల్ మీడియా వాడకం కోసం చుట్టూ ఉండే పరిసరాలను, తోటి మనుషులను కూడా మర్చిపోయేంత వసనపరుడు, బానిసగా మారిపోయాడు. అయితే…ఈ వ్యసనాన్ని ఇపుడు తనతో జీవించే జంతువులకు కూడా అలవాటు చేస్తున్నాడు.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ చింపాంజీ సోషల్ మీడియాకు అలవాటు పడి దానికి బానిస అయింది. రోజంతా వీడియోలను, ఫోటోలను చూస్తూ కాలం గడుపుతోంది. ఫోన్‌ని వదలకుండా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి వీడియోలను చూస్తూ టైంపాస్ చేస్తోంది. ఈ చింపాంజీ యజమాని దానికి స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ నేర్పించాడు. అప్పటినుంచి అది ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను చూస్తూ, స్క్రోల్ చేస్తూ ఉంటోంది. ఈ చింపూ స్మార్ట్‌ఫోన్‌లో తల దూర్చి ప్రపంచాన్ని మరిపోయిన వీడియోను దాని యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లకు తెగ నచ్చేసింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *