చికెన్ ధరలకు రెక్కలు

చికెన్ ధరలకు రెక్కలు

చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో కోడి మాంసం ధర 200 దాటి వినియోగదారులకు చుక్కలు చూపుతోంది. దీంతో తెలంగాణ ప్రజలు చికెన్ కొనుగోలుకు వెనుకాడే పరిస్థితి తలెత్తుతోంది. ఎండలు పోయి వర్షాకాలం వచ్చినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

వీకెండ్ వచ్చింది అంటే..నగరవాసులు నాన్ వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే నాన్ వెజ్ కి దూరంగా ఉండేలా చేస్తున్నాయి. ఇందుకు కారణం మాత్రం వాటి ధరలే. ప్రస్తుతం భాగ్యనగరం లో చికెన్ ధరలు 200పై మాటే..దీంతో రేటు ఇలా ఉండేసరికి తినాలన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంటున్నారు నగరవాసులు.

అయితే ఇంత రేట్లు పెరగడానికి కారణం లేకపోలేదు.కోడి పిల్లలను పెంచడం చాలా రిస్క్ తో కూడిన పని అని..దానితో పాటు మార్కెట్ లో చికెన్ కు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు ఇలా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

ఎండాకాలం లో శుభకార్యాలు ఏక్కువగా ఉండడం వల్ల రేట్లు అప్పుడు బాగా పెరిగాయని…వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు తగ్గుతాయని చికెన్ షాప్ యజమానులు అంటున్నారు.కానీ ఎప్పుడైనా సామాన్యుడు సైతం ఇష్టం గా తినే చికెన్ ధరలు ఇప్పుడు అందనంత ఎక్కువ పెరిగితే ఏంటీ చేసేదని నగరవాసులు వాపోతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *