మావోల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చత్తీస్‌ఘడ్‌ సర్కార్ వినూత్న విధానం

మావోల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చత్తీస్‌ఘడ్‌ సర్కార్ వినూత్న విధానం

ముల్లును ముల్లుతోనే తీయాలనేది సామెత. మావోయిస్టుల ఏరివేత కోసం అచ్చం అదే ఫార్మూలను ఫాలో అవుతోంది చత్తీస్‌ఘడ్‌ సర్కార్. లొంగిపోయినవారినే తిరిగి ఆయుధాలిచ్చిమావోయిస్టులపైకి యుద్ధానికి పంపుతోంది. తాజాగా దంతెవాడలో ఈ వ్యూహాన్నే అమలు చేసి.. ఫస్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ చేసింది.

చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ వినూత్న విధానాన్ని ఎంచుకుంది. మావోయిస్టులుగా పని చేసి లొంగిపోతున్నవారికి పోలీసు కమెండోలుగా ఉద్యోగాలిచ్చి పునరావాసం కల్పిస్తోంది. తుపాకీ పేల్చడంలో శిక్షణ పొందిన ఉండటంతో.. నేరుగా వారిని మావోల ఏరివేత కోసం రంగంలోకి దింపుతోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన సుక్మా,అబూజ్ మాడ్, మల్కన్‌గిరి, దంతెవాడ ప్రాంతాల్లో వీరి సేవలను ఉపయోగించుకుంటోంది.

బస్తర్ అడవుల్లో మావోయిస్టులుగా పనిచేసి లొంగిపోయిన 30 మంది మాజీలను నేరుగా.. తాజాగా మహిళా పోలీసు కమెండోలుగా నియమించింది చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం. దంతేశ్వరీ లడకీ పేరిట ఏర్పాటైన ఈ యాంటీ నక్సల్స్ దళం..ఇటీవల తమ తొలి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేయించింది. బుధవారం దంతెవాడలో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఈ మహిళా కమెండోలను పోలీస్‌ శాఖ వినియోగించుకున్నట్టు తెలిసింది. ఇలా మాజీ మావోయిస్టులు, గిరిజనులను ఈ పోలీసు దళంలో నియమించి.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలపై ఆధిపత్యం సాధించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఐదుగురు మహిళా కమెండోలను ఓ దళంగా ఏర్పాటు చేసి మావోయిస్టుల ఏరివేత కోసం వారిని అడవులకు పంపిస్తున్నారు పోలీసులు. గతంలో పనిచేసిన అనుభవముండంటంతో.. మహిళా కమెండోలు పని తీరు చాలా బాగుందని అంటున్నారు పోలీసులు. మొత్తానికి మావోలను నియంత్రించేందుకు తిరిగి వారినే ఆస్ర్తంగా ప్రయోగించడం ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *