టీడీపీ ప్రచారానికి సచిన్‌

టీడీపీ ప్రచారానికి సచిన్‌

ఎన్నికల ఎంత దగ్గరపడుతున్నాయో నాయకుల పావులూ అంతే వేగంగా కదులుతున్నాయి.చంద్రబాబు తన సీనియారిటీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాడు.ప్రచారాన్ని వినూత్నంగా,ఆకర్శనీయంగా ఉంచేందుకు అంతర్జాతీయ ఫేమ్‌ ఉన్న వారిని రంగంలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్‌ టెండుల్కర్‌ను టీడీపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే ప్లాన్‌లో బాబు ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sachin tendulkar on cm

హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో…

ప్రెస్‌మీట్‌ ద్వారా,సోషల్‌ మీడియా ద్వారా…సచిన్ టీడీపీ తరపున బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయమై చంద్రబాబు నేరుగా ముంబై వెళ్లి సచిన్‌ను కలిసినట్టు తెలుస్తోంది.కొత్త రాజధాని నిర్మాణపనుల గురించీ,తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించీ తెలిపీ సచిన్‌ను ప్రచారపర్వంలో భాగం కావాలని కోరినట్టు తెలుస్తోంది.దానికి సచిన్‌ కూడా సముఖంగా ఉన్నడానీ…అయితే ఐపీఎల్‌ కారణంగా ప్రత్యక్ష ప్రచారంలో పాల్గోకపోవడం వల్ల సోషల్ మీడయా నుంచీ,ప్రెస్‌మీట్ల నుంచీ తన ప్రచారం ఉంటుందని సచిన్ హామీ ఇచ్చాడట.ఈ ఐపీఎల్‌లో హైదరాబాద్‌ వేదికగా జరిగే ముంబై జట్టు పాల్గొన్న మ్యాచ్‌లలో ప్రెస్‌మీట్‌ ద్వారానూ,మిగతా సమయాల్లో సోషల్‌ మీడియా ద్వారానూ ఆంధ్రా రాజకీయాలకు సంబంధించిన సచిన్‌ మాటలుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీటిలో ఎంత మాత్రమూ నిజం లేదని కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు.ఇదే కనుక నిజమైతే తెలుగుదేశానికి మరింత బలం పెరుగుతుందని పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *