చంద్రబాబు వ్యూహ రచన...వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే పెండింగ్ ఉంచడానికి కారణాలేంటి..?

చంద్రబాబు వ్యూహ రచన...వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే పెండింగ్ ఉంచడానికి కారణాలేంటి..?

అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం చంద్రబాబు తనదైన మార్క్‌ చూపించారు. టీడీపీ తొలి జాబితాలో ఎక్కువ శాతం సిట్టింగ్‌లకే కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న స్థానాలను మరో రెండ్రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఇదిలాఉంటే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం టీడీపీ తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

162 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితాను ఆపార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఫస్ట్‌ లిస్ట్‌లో ఎక్కువ శాతం సిట్టింగ్‌లకే అవకాశం కల్పించారు. మరో రెండ్రోజుల్లో మిగతా పేర్లు ప్రకటిస్తానని చెప్పారు. ఇదిలాఉంటే.. శ్రీకాకుళంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 10 ఉంది.. మొదటి లిస్ట్‌లో 9 మందికి కేటాయించారు. అటు విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు 8 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. విశాఖ జిల్లాలో మొత్తం 15 సీట్లకు తొలి జాబితాలో 11 మందికి టికెట్‌ ఖరారు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో 16 స్థానాలకు.. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితాలో 11 మందికి టికెట్లు కేటాయించారు.

కృష్ణా జిల్లాలోనూ చంద్రబాబు తనదైన మార్క్‌ చూపించారు. జిల్లాలో మొత్తం 16 సీట్లుంటే అందులో 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అటు గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 14 చోట్ల పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. మొత్తం అసెంబ్లీ స్థానాలు 12 ఉంటే.. తొలి జాబితాలో 10 స్థానాలకు టికెట్లు ఖరారు చేశారు. నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఫస్ట్‌ లిస్ట్‌లో 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు.

రాయలసీమలోని కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలుంటే.. మొదటి జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అటు కర్నూలు జిల్లాలోని 14 సెగ్మెంట్‌లలో 9 స్థానాలకు టికెట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు కేవలం ఐదు సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. అటు చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. చంద్రబాబు 8 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *