ఫని తుపాను సమయంలో సీఎస్‌ బాగా పనిచేశారు -చంద్రబాబు

ఫని తుపాను సమయంలో సీఎస్‌ బాగా పనిచేశారు -చంద్రబాబు

సీఎస్‌కు ప్రశంసలు.. ఉపాధిహామీకి సూచనలు.. ఎన్నికల ఫలితాలపై చలోక్తులు ఇవీ ఏపీ క్యాబినెట్‌ హైలెట్స్‌. నాలుగు అంశాల అజెండాపై చర్చించిన మంత్రివర్గం అధికారులకు పలు సూచనలు చేసింది. ఫని తుపాను విషయంలో సీఎస్‌ బాగా పనిచేశారంటూ క్యాబినెట్‌ అభినందించింది.

గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ క్యాబినెట్‌ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఫని తపాను, కరువు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ చెల్లింపులపై మంత్రిమండలి చర్చించింది. ఈసీ సూచనలతో నాలుగు అంశాలపైనే క్యాబినెట్‌ పోకస్‌ చేసింది. తాగునీటి ఎద్దడి.. నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు క్యాబినెట్‌ మీటింగ్‌లో వివరించారు. పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, అందుబాటులో ఉన్న నీటి వనరుల వివరాలను క్యాబినెట్‌ ముందుంచారు. అయితే అవసరం ఉన్న చోట వెంటనే నిధులు విడుదల చేపట్టాలలని సీఎం ఆదేశించారు.

ఇదిలాఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పెద్దలకు దూరం పెరిగిందని అందరూ భావించిన సమయంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.అయితే మంత్రివర్గం సమావేశం ఆసాంతం మంచి వాతావరణంలో జరిగిందని మంత్రులు తెలిపారు. ముందుగా కేబినెట్‌ హాల్‌లోకి వచ్చిన సీఎస్‌.. మంత్రుల వద్దకు వెళ్లి పలకరించారు. ఈ ప్రభుత్వంలో ఇది 108వ సమావేశమని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. ఫని తుపాను సమయంలో సీఎస్‌ బాగా పనిచేశారని, అలాగే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకున్నారని సీఎం చంద్రబాబు మంత్రిమండలి అభిప్రాయపడింది. సీఎస్‌ ఎల్వీ పనితీరును సీఎం సహా మంత్రులందరూ అభినందించారు.

ఇదిలాఉంటే.. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు వెనక్కు వచ్చాయన్న ఆంశం కేబినెట్‌ ముందుకు వచ్చింది. దీంతో చెక్కులు పాస్‌ అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. మొత్తానికి రాష్ట్రమంతటా చర్చ జరిగినా..క్యాబినెట్‌ మీటింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంతో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ కూడా తొలగిపోయిందని మంత్రులు వ్యాఖ్యానించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *