అవసరం కోసం బాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా?

అవసరం కోసం బాబు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి.కానీ చంద్రబాబు మాత్రం కామ్‌గా లేరు.పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు.కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం … కర్నాటక,మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.కాంగ్రెస్‌ గెలుపు కోసం చంద్రబాబు ఎందుకంత కష్ట పడుతున్నారు.కేవలం మోదీపై కసితోనేనా ?

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత ఆరాటపడుతున్నారో తెలియదు కానీ..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఆ పార్టీ గెలుపు కోసం తెగ తపన పడుతున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు.ఏపీలో మాత్రం తూచ్ అన్నారు.అక్కడితో ఆగారా? అంటే అదీ లేదు.ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.ఈ మధ్యే రెండుసార్లు కర్ణాటకలో కూడా కాంగ్రెస్,జెడీఎస్ అభ్యర్ధుల ప్రచారం కోసం ఏకంగా రాహుల్ గాంధీతో కలసి మరీ ప్రచారం చేశారు.చూస్తుంటే కాంగ్రెస్ గెలుపు రాహుల్ గాంధీ కంటే చంద్రబాబుకే అత్యంత అవసరం అన్న చందంగా తయారైంది పరిస్థితి.
బైట్.చంద్రబాబు,టీడీపీ అధినేత

ఏపీని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.ఏపీ ప్రజలను అంతగా మోసం చేసిన కాంగ్రెస్ కోసం చంద్రబాబు ఇంతగా తాపత్రయ పడటానికి కారణం ఏంటి?.తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎప్పుడైనా..ఎవరితో అయినా పొత్తు పెట్టుకోగలరని ఇప్పటికే పలుమార్లు నిరూపితం అయింది.గోధ్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసి..జన్మలో బిజెపితో కలవనని శపథం కూడా చేశారు.ఆ శపథాన్ని తీసి గట్టున పెట్టి..2014 ముందు మోదీ వేవ్ ను గుర్తించి బిజెపితో జట్టుకట్టారు.మళ్ళీ బయటకు వచ్చి..గోద్రా అల్లర్ల గురించి మాట్లాడే తెగువ..ధైర్యం చంద్రబాబుకు తప్ప ఎవరికీ లేదు.

అంతే కాదు..అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి ఏపీ రైతుల ప్రయోజనాలకు గండికొట్టిన దేవేగౌడ,ఆయన మనవడి కోసం…బాబ్లీ వంటి అక్రమ నిర్మాణం చేపట్టి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీ ప్రజలను ఎంతో బాధించే విభజన చేసిన కాంగ్రెస్ తోనే ఎంతో ఈజీగా జట్టుకట్టిన చంద్రబాబుకు ఆల్మట్టి..బాబ్లీ ప్రాజెక్టుల నష్టం
ఓ పెద్ద లెక్కా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *