ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారా..?

ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారా..?

భయానికి భయం పుట్టించే స్వభావం చంద్రబాబుది.రెండు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు..ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ మానసికంగా బలహీనమవుతున్నారా..అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అంతేకాదు అపర చాణక్యుడిగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చెలరేగిన చంద్రబాబులో ఇప్పుడోరకంగా భయం కనబడుతోంది.ప్రతిపక్షం వైసీపీ పరుగులు పెడుతుందని..జగన్‌ దూకుడుగా జనాల్లోకి వెళ్తున్నారన్న భయం చంద్రబాబులో ఎక్కువైనట్లు కనబడుతోంది.

గత ఎన్నికల్లో జనసేన కలిసి రావడం సహా అటు బీజేపీతో కలవడంతో బాబుకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.కానీ ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు చంద్రబాబు.తాను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు..ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.అటు కేంద్రం సహా ఇటు వైసీపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబు..జగన్‌లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులైతే రౌడీరాజ్యం ఏలుతుందంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.ఒక్క జగనే కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికల వేళ ఖర్చుల విషయంలో స్పందించిన చంద్రబాబు…ఎన్నికల కమిషన్ నిబంధనల వల్ల కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నామంటూ అసహనం వ్యక్తం చేశారు.పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందు జాగ్రత్తతోనే పసుపు కుంకుమ,అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు ప్రవేశపెట్టానని చెప్పారు.అంతేకాదు..,ప‌సుపు కుంకుమ ప‌థ‌కం టీడీపీకి ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచి ఊపే తీసుకొచ్చింది.అయినా..చంద్రబాబును మాత్ర భయం వీడట్లేదు.

ఇదిలా ఉంటే..ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.పసుపు కుంకుమ,అన్నదాత సుఖీభవను పథకాల రూపంలో ప్రజలకు పంచానన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *