చంద్రబాబు సన్నిహితుడు గాంధీ ఇంట్లో సీబీఐ సోదాలు..

చంద్రబాబు సన్నిహితుడు గాంధీ ఇంట్లో సీబీఐ సోదాలు..

మాజీ సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ సోదాలు జరిపింది. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు దాడులు చేపట్టారు. ఆయన దగ్గర అధికారులు రూ.4 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు.

రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన కేసులో పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ మార్పులు చంద్రబాబు ఆదేశాలతో జరిగాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి గాంధీ సహకరించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలు విషయంలో శ్రీనివాస్‌పై ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవో కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు.

ఇ‍ప్పటి వరకు అధికారులు జరిపిన సోదాల్లో… కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం, కంకిపాడులో 3 సెంట్ల స్థలం ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు బ్యాంకు ఖాతాలో భారీగా నగదును కూడా గుర్తించారు. కూకట్‌పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో 20 లక్షలు, దగ్గర బందువుల ఖాతాలో 10‌లక్షల నగదు, కుటుంబ సభ్యులపై పిక్సడ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది.

అయితే.. బొల్లినేని శ్రీనివాస్‌పై జరగుతున్న దాడులపై పలువురు ఆత్మ రక్షణలో పడినట్లు తెలుస్తుంది. జీఎస్టీ అధికారిగా ఉన్న శ్రీనివాస్ పలువరుకి సహకరించారని సమాచారం. ఈ సోదాల్లో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *