బాలకృష్ణపై మండిపడ్డ ఐటీ ఉద్యోగులు

బాలకృష్ణపై మండిపడ్డ ఐటీ ఉద్యోగులు

బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనం అవడం ఇపుడే కొత్త కాదు. కానీ, ఎన్నికల ప్రచారంలో ఉన్నపుడు కొంత పరిధిలోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్క మాట చేజారినా ఈసీ కొరడా ఝులిపిస్తుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాలకృష్ణ మంగళవారం నోరు జారారు. ఐటీ ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఉద్యోగుల నుంచి బాలకృష్ణకు తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేసింది.

ఏ ఒక్కరి వల్లో ఐటీ రంగం అభివృద్ధి కాలేదు…

ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, హిందూరపురం ఎమ్యెల్యే బాలకృష్ణ ఐటీ ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్య సంచలనం అయింది. తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు సందీప్ ముక్తాలా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సందీప్ ముక్తాలా మాట్లాడుతూ…చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్ నేర్పించారంటూ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు వలనే ఐటీ అభివృద్ధి జరిగినట్టు చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎవరో ఒకరి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించడం ఉండదన్నారు. ఉద్యోగుల జోలికి రాకుండా ప్రచారం చేసుకోవాలని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *