శభాష్ సింధు.. ఓడినా నువ్వు చాలా గ్రేట్

శభాష్ సింధు.. ఓడినా నువ్వు  చాలా గ్రేట్

వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడిన సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రముఖ భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధును ఫైనల్ ఫోబియా వీడటం లేదు. సెమీస్‌లో జపాన్ క్రీడాకారిణి యమగుచిని మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు.. స్పెయిన్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. పీవీ సింధు ఓడినా దేశ వ్యాప్తంగా క్రీడాభిమానుల మనస్సును గెలుచుకుంది. ఆమె శ్రమించిన తీరును క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు మెప్పుపొందిన సింధు

సింధు ఆట తీరుపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘శభాష్ సింధు.. ఓడినా నువ్ చాలా గ్రేట్’ అని సీఎం అభినందించారు. కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, అద్భుత ప్రదర్శనను ప్రదర్శించారని మెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఘనతను ఘనంగా చాటిందన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించి భారత షట్లర్ల గొప్పదనాన్ని చాటిందని సీఎం చెప్పుకొచ్చారు. ఛాంపియన్ షిప్‌లో ఇప్పటి వరకు నాలుగు పతకాలు సాధించి సువర్ణాధ్యాయాన్ని సృష్టించిందని సింధును చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచ దిగ్గజ క్రీడాకారులను ఓడించి ఫైనల్ చేరిన సింధు మెగా టోర్నీలో అసామాన్య ప్రతిభ చూపిందని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. వరుసగా రెండు సార్లు ఫైనల్స్‌కు చేరుకుని ఘన చరిత్రకు శ్రీకారం చుట్టిందని బాబు చెప్పుకొచ్చారు.

PV Sindhu vs Carolina Marin Final

కాగా.. కరోలినా మారిన్‌తో ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదింటిలో సింధు గెలిచింది. కానీ.. 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ సెమీస్‌లో సింధును కరోలినా ఓడించిన విషయం తెలిసిందే. గత రియో ఒలింపిక్స్‌లో సింధును ఓడించిన కరోలినా స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *