షుగర్ ఉందని అన్నం మానేయక్కరలేదు!

షుగర్ ఉందని అన్నం మానేయక్కరలేదు!

తెలుగు ప్రజలు ఎక్కువగా భోజన ప్రియులు. రకరకాల వంటకాలతో కడుపారా ఆరగిస్తాం. అయితే…మారిన పరిస్థితుల కారణంగా ఈమధ్య కాలంలో చాలామందికి షుగర్ వ్యాధి నోటిని కట్టెస్తోంది. ఇష్టమైన ఆహారాన్ని సంతృప్తిగా తినలేని స్థితి. ఇంకా కొందరైతే షుగర్ వ్యాధికి అన్నమే పెద్ద అడ్డంకి అని చెప్పి పూర్తీగా అన్నాన్ని మానేస్తుంటారు. నిజానికి షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మొత్తానికి అన్నం తినడం మానేయక్కరలేదు. వీలైనంత తక్కువగా తీసుకోవచ్చు. దీనికి కారణమూ లేకపోలేదు. అన్నంలో గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్‌లో మార్పులు వస్తుంటాయి. అన్నంతో పాటు మనం తినే కూరలు, పెరుగు వల్ల ఈ గ్లిసమిక్ ఇండెక్స్ మోతాదు తగ్గుతుంది. కాబట్టి అన్నం తినడం వల్ల షుగర్ ఉన్నవాళ్లకు ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

రోజులో ఒక అరగంట!

ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినవచ్చు. ఇలా తినడంవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా, ఒక పూట అన్నం తింటే మరో పూట అల్పాహారం, చపాతీ, పుల్కాలు వంటివి తినాలి. వీటితో పాటు తాజా కూరగాయలు, నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వ్యాయామం చేయడం అసలు మరిచిపోకూడదు. రోజులో ఓ 30 నిమిషాలు ఏదోక వ్యాయామం చేస్తూండాలి. లేకపోతే వాకింగ్ అయినా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల షుగర్ మాత్రమే కాదు..ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *