రాంప్రసాద్ మర్డర్‌లో దర్యాప్తు వేగవంతం

రాంప్రసాద్ మర్డర్‌లో దర్యాప్తు వేగవంతం

కోగంటి సత్యనారాయణ అలియాస్ సత్యం… పేదరికం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బడా పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి. విజయవాడలోనే కాకుండా కృష్ణాజిల్లాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ సుపరిచితమయ్యారు. అయితే ఈ రోజు ఓ హత్య కేసులో తెలుగురాష్ట్రాలలో ఈయనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. కోగంటి సత్యనారాయణ, టీడీపీ నేత బొండా ఉమ గతంలో సంయుక్తంగా కొండపల్లి పారిశ్రామిక వాడలో ఎస్‌డీవీ స్టీల్స్‌ని నెలకొల్పారు. అయితే దీనిని లీజుకు తీసుకున్న పారిశ్రామిక వేత్త రాంప్రసాద్.. ఆయన భాగస్వాములతో కలిసి రాష్ట్రంలో ఉన్న తుక్కు వ్యాపారుల నుంచి ఇనుమును కొనుగోలు చేసి వాటిని కరిగించి ఇనుప రాడ్లు తయారు చేసే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 2005లో లీజుకు తీసుకున్న రాంప్రసాద్.. కామాక్షి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాన్ని కొనసాగించారు.

రాంప్రసాద్ అతని కుటుంబ సభ్యులను, బంధువులను డైరెక్టర్లుగా నియమించారు. అతని బావమరిదికి భవానీపురం ఐరన్ యార్డ్ లో, వైజాగ్ లోనూ రమ్యా స్టీల్స్ పేరు మీద షాపులు కూడా పెట్టించారు. కొంత కాలానికి లీజు ఒప్పందం ముగిసింది. అయితే ఒప్పందం ప్రకారం ఎస్‌డీవీ స్టీల్ అధినేతకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించకపోవడంతో పాటు తుక్కు సరఫరాదారులకు కూడా ఎగనామం పెట్టారు. దీంతో వివాదం మొదలైంది. ఐరన్ యార్డులో ఉన్న 15 నుంచి 20 కోట్ల సరుకును తన బావమరిది రమ్యా స్టీల్ కు తరలించారు. సుమారు తుక్కు వ్యాపారులకు 20 కోట్లు వరకూ బకాయిలు పడ్డాడు.

అప్పట్లో భాదితులంతా వైజాగ్‌లోని రమ్యా స్టీల్స్ వద్ద ఆందోళన కూడా చేశారు. కొందరు బాధితులు విజయవాడ, వైజాగ్ లలోని పోలీసులకు ఫిర్యాదుచేసారు. వైజాగ్ గ్రీన్ సిటీలో రాంప్రసాద్, అతని బావమరిదికి రూ.2 కోట్లతో రెండు విల్లాలు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. బాధితులు మాత్రం తమకు ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారో, అసలు వస్తాయోరావోనని ఆందోళనలో ఉన్నారు. మోసపోయిన బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. దీనికి తోడు బాధితులందరికీ వెన్నుదన్నుగా ఉన్న కామాక్షి స్టీల్స్ యజమానులలో ఒకరైన కోగంటి సత్యనారాయణపై అతని అనుచరుడు, టెక్కెం శ్యామ్‌పై పోలీసులు కేసులు నమోదుచేసి వారిని అరెస్ట్ చేశారు.

ఆతరువాత కొంత మంది పెద్దమనుషుల సమక్షంలో సెటిల్ మెంట్ కూడ జరిగింది. ఈ ఒప్పందాన్ని కూడా రాంప్రసాద్ పట్టించుకోకపోవటంతో శాంతి భద్రతలపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5సంవత్సరాలు క్రితం జరిగిన పరిస్థితులే ఈ హత్యకు దారి తీసాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి వివరాలు పోలిసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొగంటి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు కూడా మాటల యుద్దం తారాస్దాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో బోండా ఉమా ఓటమికి కొగంటి సత్యనారాయణ పని చేసారు. దీంతో ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోటంగి సత్యనారాయణ అల్లుడుని విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఒక క్లారటీ ఉన్న ఈ కేసులో సినీ పక్కిలో ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తామే హత్య చేశామని టెక్కెం శ్యాం, అతని అనుచరులు లొంగిపోయారు. రాంప్రసాద్ బావమరిది, ఊరా శ్రీనివాస్.. ప్రోద్భలంతోనే హత్య చేశామని చెప్పటంతో పోలీసులుకు కొత్త తలనొప్పులు వచ్చినట్టైంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *