దుబాయ్‌ టవరు చూడర బాబూ..!

దుబాయ్‌ టవరు చూడర బాబూ..!

ఆ దేశంలో భవనాలు ఆకాశాన్ని తాకుతాయి. సముద్రంలో భూమిని నిర్మిస్తారు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూల తోటలు ఉంటాయి. సాగర లోతుల్లో ఉండే వింతలు అద్భుతంగా ఉంటాయి. ఆదో స్వర్గసీమ. అదేంటో తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్ స్టోరి.

యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌… UAE. ఈ దేశంలోని ఏడు ఎమిరైట్స్‌లో దుబాయ్ ఒకటి. మిగిలినవి అబుదాబి, షార్జా, అలైన్, రాస్ అల్ ఖైమా, పుజైరా, ఉమ్మ్ అల్ క్వయిన్ మొదలయినవి. దుబాయ్ సిటీ ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి చెందిన నగరం.

దుబాయ్‌ అంటే మదిలో మెదిలేది ఆకాశానంటే భవనాలే. ప్రపంచంలోకెల్లా ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా ఇక్కడే ఉంది. ఈ భవన నిర్మాణానికి అబుదాబి రాజు ఖలీఫా ఆర్థిక సాయం చేయడంతో ఆయన పేరే పెట్టారు. ఈ భవనం ఎత్తు 820 మీటర్లు. ఈ భవనంలో 160 అంతస్తులు ఉన్నాయి. 148వ అంతస్తు వరకు పర్యటకులకు అనుమతి ఉంటుంది. ఈ టవర్ ఎక్కి చూస్తే దుబాయ్ నగరాన్ని ఆకాశం నుంచి చూసినట్లు ఉంటుంది.

అబుదాబి… యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని. పర్షియన్‌ గల్ఫ్‌ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుందీ నగరం. అబుదాబిలో కార్నిచ్‌ బీచ్‌ సహజంగా ఏర్పడింది కాదు. సముద్రాన్ని కొంత దూరం మళ్లించిన నీటిపాయల వల్ల ఏర్పడిన బీచ్‌ అది. తెల్లని ఇసుకనీ నీలి సముద్రం చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నగరం రాజధాని కావడంతో అధికార కార్యాలయాలు ఎక్కువ. అన్నీ అద్దాల మేడలే. ముప్ఫై అంతస్తులకు పైగా ఉన్న భవనాలు దాదాపు వెయ్యికి పైగా దుబాయ్‌లో ఉన్నాయి. ఆర్కిటెక్చర్‌ అద్భుతాల్లో దుబాయ్‌ని మించిన నగరం లేదు. యూఏఈ జాతిపిత షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహయాన్‌ కలే గ్రాండ్‌ మాస్క్‌ మసీదు. ప్రపంచాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రధాన ప్రార్థనా మందిరం గోడమీద అల్లా 99 పేర్లు కనిపిస్తాయి. వందో పేరు అల్లాకే కనిపిస్తుందట.

ఎడారిదేశం దుబాయ్‌లో ఏసీ లేకుండా బతకలేం. అందుకే అక్కడి ప్రభుత్వం ఇంటి బయట ఉండే సెక్యూరిటీ గార్డుకు కూడా ఏసీ సౌకర్యం కల్పించాలనే నిబంధన పెట్టింది. ఆసియా దేశాల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ఇక్కడినుంచి ఆఫ్రికాకు ఎగుమతి అవుతుంటాయి. దెయిరా, బుర్‌ దుబాయ్‌ ప్రాంతాలను వేరుచేస్తూ దుబాయ్‌ జలసంధి ఉంటుంది. మనతో పోలిస్తే అక్కడ బంగారం ధర తక్కువ. అందుకే ఆభరణ ప్రియులకి ఇది నిజంగా స్వర్గసీమే. దుబాయ్‌, షార్జా జంట నగరాలు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లను ట్యాంక్‌బండ్‌ వేరుచేస్తున్నట్లుగానే అక్కడి ఫ్లై ఓవర్‌ రెండు నగరాలనూ వేరు చేస్తుంది. డెజర్ట్‌ సఫారీ… షార్జా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డెజర్ట్‌ సఫారీ సెంటర్‌ ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఈ సఫారీ ప్యాకేజీ సాగుతుంది. ఇసుకతిన్నెల మధ్యలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది.

దుబాయ్.. ఓ గ్లోబల్ హబ్. ఈ ఎడారిలో ఆయిల్ వచ్చే డబ్బుకన్నా… టూరిజం నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. విందులు, విలాసాలు.. రాజరికం, రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం బహుశా దుబాయేనేమో.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *