ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విలువ 2 లక్షల కోట్లు...ఏయే పథకాలకు ఎంతెంత!

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విలువ 2 లక్షల కోట్లు...ఏయే పథకాలకు ఎంతెంత!

తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జగన్ ఆధ్వర్యంలో తొలి బడ్జెట్‌ను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నవరత్నాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమావేశాలకు ముందు మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు.

ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు జాతిపిత మహాత్మగాంధీ వ్యాఖ్యలు…’ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉందని ఈ దేశంలోని ప్రతీ పేద వ్యక్తీ అర్థం చేసుకోవాలి. ఆర్థిక,సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తీ నివశించగలిగేలా ఉండాలి’ అనే మాటల స్పూర్తీతో మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేసపెట్టారు. అలాగే…ఈ ప్రభుత్వ ఏర్పడటానికి నమ్మకం, విశ్వసనీయత అనే రెండు అంశాల ఆధారంగా మాకు ప్రజాతీర్పు లభించిందని ఆయన అన్నారు.

ఇంకా మాట్లాడుతూ…రాష్ట్రాభివృద్ధీ, అన్ని రంగాల సమాన అభివృద్ధీ మా ప్రభుత్వ లక్ష్యం. గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తాం. రాయలసీమకు నీరందిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తీ చేస్తాం. తాగునీటి ప్రాజెక్టులకు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేస్తాం. టెండర్లలో అవెనీతికి ఆస్కారం లేకుండా చూస్తం అని చెప్పారు.

మొత్తం బడ్జెట్ విలువ…రూ. 2,27,975 కోట్లు.

పథకాల కేటాయింపుకు సంబంధించి….
– విద్యా రంగానికి రూ. 32,618 కోట్లు
– వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
– సాగునీటి రంగానికి రూ. 13,139 కోట్లు
– వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు
– వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ. 8750 కోట్లు
– అమ్మఒడి పథకానికి రూ. 6455 కోట్లు
– మంచి నీటి, మురుగునీటి నిర్వహణకు రూ. 2234 కోట్లు
– విద్యుత్ రంగానికి రూ. 6861 కోట్లు
– గృహ నిర్మాణానికి రూ. 6587 కోట్లు
– తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
– ధరల స్థిరీకరణ నిధికి రూ. 3000 కోట్లు
– పరిశ్రమలకు రూ. 3986 కోట్లు
– విపత్తు నిర్వహణకు రూ. 2000 కోట్లు
– వైఎస్సార్-పీఎం ఫసల్ భిమాకు రూ. 1163 కోట్లు
– ఎస్సీల సంక్షేమానికి రూ. 798 కోట్లు
– సాంకేతిక విద్యకు రూ. 580 కోట్లు
– గ్రామీణాభివృద్ధికి రూ. 329 కోట్లు
– క్రీడలు, యువజన సర్వీసులకు రూ. 329 కోట్లు
– విత్త సరఫరా కోసం రూ. 200 కోట్లు
– గిడ్డంగుల కోసం రూ. 200 కోట్లు
– ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ రూ. 475 కోట్లు
– వ్యవసాయ పరిశొధన కేంద్రానికి రూ. 109 కోట్లు
– రైతులకు వడ్డీ లేని ఋణాలకు రూ. 100 కోట్లు
– కళలు, సాంస్కృతిక విభాగానికి రూ. 77 కోట్లు
– బోర్ రిగ్గుల కోసం రూ. 200 కోట్లు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *