ఎంపిటిసి ఫలితాలలో...యువకుడి దారుణ హత్య

ఎంపిటిసి ఫలితాలలో...యువకుడి దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో యువకుడి దారుణ హత్య. నిన్న జరిగిన ఎంపిటిసి ఫలితాలలో డోకుర్ గ్రామంలో ఎంపీటీసీగా బిజెపి అభ్యర్థి యజ్ఞం భూపాల్ రెడ్డి గెలవడం జరిగింది. దీంతో యువకులంతా సాయంత్రం జూగింగ్ తీసే క్రమంలో ప్రత్యర్థి వర్గం టిఆర్ఎస్ అభ్యర్థి అనుచరులకు వీళ్లకు మధ్యన గొడవ జరిగింది. ప్రత్యర్థి వర్గం వాళ్లు ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను కత్తులతో పొడవడంతో ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలు కాగా జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందడం జరిగింది. విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వాళ్ళు వచ్చి పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *